అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని(YSRCP Office) కూల్చివేశారు. ఇవాళ తెల్లవారుజామున బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీసు నిర్మాణం విషయంలో హైకోర్టును ఆశ్రయించినా.. స్థానిక ప్రభుత్వ అక్రమంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఏపీ సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. కూల్చివేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశించినా.. సీఆర్డీఏ అధికారులు మాత్రం ఆగమేఘాల మీద ఆ కట్టడాన్ని కూల్చివేశారు.
బుల్డోజర్లతో కేవలం రెండు గంటల్లోనే పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. తెల్లవారకముందే సీఆర్డీఏ ఆదేశాల్ని మున్సిపల్ అధికారులు అమలు చేశారు. గేట్లు మూసేసి మరీ పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేత జరిగింది. సీఆర్డీయే ఆదేశాలపై కోర్టును ఆశ్రయించినా.. అవేమీ పట్టించుకోకుండా.. నోటీసులివ్వకుండా నిర్మాణాన్ని సీఆర్డీఏ కూల్చివేసింది. చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీస్కు వెళ్లే మార్గంలో వైఎస్ఆర్సీపీ ఆఫీసును నిర్మిస్తున్నారు. కోర్టు ఆదేశాలను సీఆర్డీఏక ధిక్కరించిందని, దీనిపై న్యాయస్థానానికి వెళ్లే యోచనలో వైఎస్సార్సీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కూల్చివేతకు సంబంధించిన వీడియోను వీక్షించండి.
#WATCH | Amaravati, Andhra Pradesh: YSRCP’s central office in Tadepalli was demolished today early morning.
As per YSRCP, “TDP is doing vendetta politics. The demolition proceeded even though the YSRCP had approached the High Court the previous day, challenging the preliminary… pic.twitter.com/qtO3p6sPyA
— ANI (@ANI) June 22, 2024