న్యూఢిల్లీ : బ్రెజిల్‌కు చెందిన ఫిట్నెస్, హెల్త్ ఇన్ఫ్లుయన్సర్ అడ్రియానా థైసెన్ (49) అంతుపట్టని అనారోగ్యం కారణంగా మరణించిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. డ్రికాగా పేరొందిన థైసెన్ సౌ పోలోలోని తన ఉబెర్లాండియా అపార్ట్మెంట్లో విగత జీవిగా పడిఉన్నట్టు తెలిసింది. ఆమె మరణానికి కారణాలేంటనేది తెలియరాలేదు. థైసెన్ మరణానికి కారణాలేంటనేది ఆమె కుటుంబసభ్యులు ప్రకటించలేదు.
ఫిట్నెస్ ట్రైనర్ తన వెయిట్ లాస్ ప్రస్ధానంపై అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించేది. గత ఏడాదిలో ఆమె ఏకంగా 45 కిలోల బరువు తగ్గడం గమనార్హం. డ్రికా మరణించిదని బాధాతప్త హృదయాలతో వెల్లడిస్తున్నామని ఆమె కుటుంబం, డ్రికా స్టోర్ టీమ్, డ్రికా బ్లాగ్ వెల్లడించింది. థైసెన్కు ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా ఆరులక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.
ఇన్‌స్టా పేజ్‌లో ఆమె తరచుగా బరువు తగ్గేందుకు ఆమె ఎఫర్ట్స్ గురించి అప్డేట్స్, వర్కవుట్, హెల్తీ డైట్ టిప్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. తాను టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచి అధిక బరువుతో బాధపడుతున్నానని ఆమె సోషల్ మీడియాలో అంగీకరించారు. 39 ఏండ్ల వయసులో తాను దాదాపు 100 కిలోల బరువు ఉన్నానని చెప్పారు. కుంగుబాటు, డ్రగ్ అడిక్షన్తో బాధపడిన అనంతరం సరైన షేప్‌లోకి వచ్చేందుకు తాను ఎలా నిర్ణయం తీసుకున్నాననేది పలు పోస్ట్‌ల్లో వివరించింది.
Read More :
Chicago | అమెరికాలో కుటుంబం దారుణ హత్య.. భార్యాభర్తలు, పిల్లలతో సహా కుక్కలను షూట్ చేసి చంపేశారు!