Blood Pressure | న్యూఢిల్లీ : గంటలకొద్దీ నిలబడి పనిచేసేవాళ్లలో బీపీ సమస్యలు తలెత్తే అవకాశముందని తాజా అధ్యయనం తేల్చింది. బీపీ సమస్యలు అనేక ఏండ్లుగా కొనసాగటం.. గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నది. నిశ్చలంగా ఒక చోట కూర్చొని పనిచేసేవాళ్లకు ఈ ముప్పు ఉండదని స్పష్టం చేసింది. ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కు పరిశోధకుల అధ్యయనంలోని అంశాలపై ‘మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్, ఎక్సర్సైజ్’ జర్నల్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.
రోజులో ఎక్కువ సేపు నిలబడి పనిచేసే మున్సిపల్ కార్మికుల బీపీ స్థాయిల్ని పరిశోధకుల బృందం లెక్కించింది. ఒక రోజులో వివిధ సమయాల్లో వారి బీపీ రీడింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుంది. గంటలకొద్దీ నిలబడి పనిచేస్తున్నవారిలో బీపీ ఎక్కువగా నమోదుకావటం నిర్ధారణైంది. డెస్క్ జాబ్ చేసేవాళ్లలో గంటలకొద్ది కూర్చోవటం వల్ల కూడా బీపీ సమస్యలు వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు.