రాయ్‌పూర్: ట్రాక్టర్‌పై షికారు కోసం నలుగురు బాలురు స్కూల్ ఎగ్గొట్టారు. వారిలో ఒకరు ట్రాక్టర్ నడిపాడు. ఒకచోట ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో దాని కిందపడి ముగ్గురు బాలురు మరణించారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. (Boys Skip School For Tractor Ride) ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నలుగురు విద్యార్థులు స్కూల్‌కు డుమ్మాకొట్టారు. ట్రాక్టర్‌పై షికారుకు బయలుదేరారు. ఒకచోట రోడ్డు పక్కన గుంత ఉండటంతో నడుపుతున్న బాలుడు అదుపుకోల్పోయాడు. దీంతో ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. దాని కింద పడి ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, ట్రాక్టర్ ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి వారు చేరుకున్నారు. మోగ్రా గ్రామానికి చెందిన 16 ఏళ్ల ప్రీతమ్ చంద్రకర్, 16 ఏళ్ల మయాంక్, చర్రా గ్రామానికి చెందిన 14 ఏళ్ల హోనేంద్రను మృతులుగా గుర్తించారు. బానగర్కు చెందిన బాలుడు అర్జున్ యాదవ్ గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు తన కుటుంబానికి చెందిన ట్రాక్టర్‌ను మైనర్ బాలుడు చంద్రకర్ నడిపినట్లు పోలీసులు తెలిపారు. స్కూల్‌కు డుమ్మాకొట్టిన ఈ విద్యార్థులు ట్రాక్టర్‌పై కురుద్ వెళ్లారని, తిరిగి వస్తుండగా చర్రాలోని వ్యవసాయ కాలేజీ సమీపంలో అది బోల్తాపడటంతో ముగ్గురు బాలురు మరణించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.