న్యూఢిల్లీ: బెడ్ బాక్స్‌లో బాలుడి మృతదేహం (Boy’s body inside bed box) కనిపించింది. ఒక మహిళ తన కుమారుడ్ని హత్య చేసి ఉంటుందని బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నీలూ అనే మహిళ 11 ఏండ్ల కుమారుడు దివ్యాంశ్తో కలిసి ఇందర్‌పురి ప్రాంతంలో నివసిస్తున్నది. గురువారం సాయంత్రం ఆఫీస్ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంది. దీంతో కుమారుడు బయటకు వెళ్లి ఉంటాడని భావించింది. డ్యాన్స్ టీచర్‌ను ఆరా తీయగా అతడు క్లాస్‌కు వెళ్లలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కుమారుడి కోసం పరిసర ప్రాంతాల్లో వెతికింది.
కాగా, కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనతో ఇంటికి తిరిగి వచ్చిన నీలూ, బెడ్‌పైన పరుపు, బెడ్ షీట్ చిందరవందరగా ఉండటాన్ని గమనించింది. పరుపు తొలగించి చూడగా బెడ్ బాక్స్‌లోని బట్టల మధ్య అచేతనంగా పడి ఉన్న కుమారుడ్ని చూసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన మహిళపై బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. కుటుంబంలోని ప్రియమైన వారిని తొలగిస్తానంటూ ఆ మహిళ నాలుగేండ్లుగా తమను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాలుడి హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | After a minor boy was found dead inside the bed box in Delhi's Inder Puri area, the mother of the deceased says, "I was returning from my office when I got a call from his (deceased) dance teacher…When I reached home, I realised that things were messed up…We took him… pic.twitter.com/xNYoybPuUw
— ANI (@ANI) August 11, 2023