సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ ): ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముకలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీ లిమిటేషన్‌లో డివిజన్ల విభజన ఇష్టానుసారంగా చేశారని తలసాని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలం రాయ్‌లోని లీ ప్యాలెస్‌లో లషర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో గణ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును, అస్థిత్వాన్ని దెబ్బ తీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 17న 10 వేల మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు, జెండాలతో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తలసాని వెల్లడించారు. కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు. ధర్నాలు, రాస్తారోకో, బంద్‌లు, దీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు.
చరిత్రకు ఆనవాలుగా ఉస్మానియా యూనివర్సిటీ, రాష్ట్రపతి విడిది చేసే అతిథి గృహం బొల్లారంలోనే ఉందని తలసాని వివరించారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం, గాంధీ హాస్పిటల్, మోండా మారెట్, నిజాంకాలంలో నిర్మించిన 120 అడుగుల క్లాక్ టవర్, ఆర్మీ క్యాంప్ కూడా ఇకడే ఉందన్నారు. ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఆయన చెప్పారు. సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, వారి మనోభావాలను పట్టించుకోకుండా.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తాం, చరిత్రను చేరిపేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల హకులను కాలరాస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఇష్టారీతిన డివిజన్లను ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని తలసాని చెప్పారు. పోరాటానికి మద్దతుగా వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాలు, జర్నలిస్టు, కుల సంఘాలు, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్లు సమావేశంలో పాల్గొని సంఘీభావం తెలిపాయి.
జీహెచ్ఎంసీ వార్డుల విభజన, మున్సిపాలిటీల విలీనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మపై, రాజ్యాంగంపై దాడి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు మండిపడ్డారు. ఆదివారం ఆయన విడుదల చేసిన సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ నిరంకుశ పోకడలను ఆధారాలతో సహా ఎండగట్టారు. వార్డుల విభజన అనేది అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రక్రియ అని, కానీ రేవంత్ ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణను తుంగలో తొకిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కాదని, ఆస్కీ, సీజీజీ వంటి ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవుట్ సోర్సింగ్ చేయడమేనని విమర్శించారు.
మేఘరాజ్ కొఠారి వర్సెస్ డీలిమిటేషన్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేస్తూ, ప్రజాప్రతినిధులను చీకట్లో ఉంచి ఏకపక్షంగా మ్యాపులు సిద్ధం చేస్తున్నారని శ్రవణ్ ధ్వజమెత్తారు. సికింద్రాబాద్‌కు 220 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్న శ్రవణ్ దాసోజు, దీనిని మలాజిగిరి పేరుతో సమాధి చేయాలని చూడటం చారిత్రక తప్పిదమన్నారు. లషర్ బోనాలు, ఉజ్జయినీ మహంకాళి ఆలయం, సెయింట్ మేరీస్ చర్చి, క్లాక్ టవర్ వంటి చిహ్నాలు సికింద్రాబాద్ గుర్తింపు అని పేరొన్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాలను విడగొట్టడం ద్వారా వారి ఓటు బ్యాంకు దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వార్డుల విభజన మ్యాపులు, ముసాయిదా సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయాలని, ప్రతి వార్డులో పౌరులు, ప్రజాప్రతినిధులతో బహిరంగ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్‌ను ఒక ప్రత్యేక పరిపాలనా, చారిత్రక విభాగంగానే కొనసాగించాలని, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే విభజన ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు. నగర వారసత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పౌరులందరూ ఏకమై ఈ నిరంకుశ పోకడలపై పోరాడాలని శ్రవణ్ దాసోజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరీ, సామల హేమ, ప్రసన్న, సునీత, శైలజ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకు ల మహేశ్వర్ రెడ్డి, నాయకులు టీ ఎన్ శ్రీనివాస్, సభ్యులు పాండు యాదవ్, లోకనాథం, నళిని ప్రభాకర్, ముఠా జయసింహ, నర్సింహ ముదిరాజ్, వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.