పెళ్లి వేడుకలో ఓ యువకుడు సరదాగా చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. సాధారణంగా భారతీయ వివాహ వేడుకల్లో నృత్యాలు, యువత అల్లరీ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. వేడుకల్లో ఎన్నో సరదా సన్నివేశాలు తారసపడుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాహానికి వచ్చిన అతిథులు వేడుకలో సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడే కుర్చీలో కూర్చున్న ఓ యువకుడు పూనకం వచ్చినట్లు తలను ఆడిస్తూ ఉంటాడు. అనంతరం ఒక్కసారిగా తన కూర్చున్న కుర్చీలోంచి దూకి విచిత్రమైన రీతిలో డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు. అనంతరం కిందపడి మరీ డ్యాన్స్ చేస్తుంటాడు. యువకుడి డ్యాన్స్‌తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా యాందోళనకు గురవుతారు. యువకుడిని లేపే ప్రయత్నం చేస్తారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ… వీడియోనేషన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ ఎనర్జీ ఉండాల్సిందే అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు.
వీడియో పోస్టు చేసిన కాసేపటికే వేలల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమే యువకుడుపై మండిపడుతున్నారు.