Covid-19 | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇద్దరు కొవిడ్‌తో మరణించారు. ఇద్దరూ ఇప్పటికే వేర్వేరు వ్యాధులబారినపడి చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే వారికి వైరస్ సోకవడంతో పరిస్థితి విషమించింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకారం.. ఢిల్లీకి చెందిన 73 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఇప్పటికే మెటాస్టాటిక్ లంగ్ కార్సినోమా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, బీ/ఎటల్ న్యుమోనియా, అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు. మరో వ్యక్తికి 76 సంవత్సరాలుంటాయి. అతనికి ఇప్పటికే సెప్టిక్ షాక్, మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, న్యుమోనియా, డీఎం, అధిక రక్తపోటు, గుండె జబ్బులతో సెప్టిసిమియాతో బాధపడుతున్నాడు. ఇద్దరు మృతులు చికిత్స పొందుతున్న సమయంలో కొవిడ్ సోకింది. వారి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా డేటా ప్రకారం.. ఢిల్లీలో 267 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 44 మందికి కొత్తగా పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఢిల్లీలో 3533 మంది కొవిడ్ బారినపడి కోలుకున్నారు. తాజాగా 59 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 21 మంది మృతి చెందారు.