Parliament | పార్లమెంటులో గందరగోళం.. ఉభయసభలు రేపటికి వాయిదా
Parliament | పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేక ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
దాంతో పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలను బుజ్జగించి సభలు సజావుగా సాగేలా చూడాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. లండన్‌లో చేసిన వ్యాఖ్యలకుగానీ రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ఎదురుదాడికి దిగింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగారు.
ఈ పరిణామాలు మధ్య పార్లమెంటు ఉభయసభలు ముందుగా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత సభలు ప్రారంభమైనప్పటికీ మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

