అహ్మదాబాద్: రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్‌ను సందర్శించారు. వడోదర సమీపంలోని హలోల్ పారిశ్రామిక ప్రాంతంలో బ్రిటన్‌కు చెందిన భారీ యంత్రాల కొత్త జేసీబీ ఫ్యాక్టరీకి సీఎం భూపేంద్ర పాటిల్‌తో కలిసి ఆయన వెళ్లారు. కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఒక బుల్డోజర్పైకి ఎక్కి సందడి చేశారు. దానిపై నుంచి మీడియాకు చేతులు ఊపారు. జేసీబీ పైనుంచి ఆయన సందడి చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో ఇటీవల జరిగిన హనుమాన్ ర్యాలీ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న స్థానిక నగర పాలిక సంస్థ, ఆ ప్రాంతంలోని ముస్లిం ప్రజలకు చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. అక్రమ నిర్మాణాల పేరుతో బుధవారం జేసీబీలతో కూల్చివేసింది. దీనిని నిలిపివేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ స్థానిక అధికారులు లెక్క చేయలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు చేతికి అందే వరకు కూల్చివేతలు కొనసాగించడం వివాదానికి దారి తీసింది. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు ఇటీవల గుజరాత్లో కూడా బుల్డోజర్లతో ఆస్తుల కూల్చివేత ఘటనలు జరిగాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్లో గురువారం బుల్డోజర్ కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించడమే కాకుండా ఒక దానిపైకి ఎక్కి సందడి చేయడం వివాదస్పదమైంది. బ్రిటన్ కంపెనీ జేసీబీకి చెందిన బుల్డోజర్లతో అమాయక ముస్లిం ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి భయాందోళన సృష్టిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ జహంగీర్‌పూర్‌లో ముస్లిం ప్రజల ఆస్తులు కూల్చివేసిన మరునాడే గుజరాత్లో కొత్త జేసీబీ ఫ్యాక్టరీని బ్రిటన్ ప్రధాని ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందని ఒకరు మండిపడ్డారు.
#WATCH UK PM Boris Johnson along with Gujarat CM Bhupendra Patel visits JCB factory at Halol GIDC, Panchmahal in Gujarat
(Source: UK Pool) pic.twitter.com/Wki9PKAsDA
— ANI (@ANI) April 21, 2022
Seems like @BorisJohnson's visit is now turning increasingly tone-deaf. Visiting a plant of the JCB company while its bulldozers are being used to illegally terrorise Muslims? Someone at @UKinIndia failed to do their job. Only way Johnson can salvage this trip is by speaking up. https://t.co/W42Zb72DC2
— Mohamed Zeeshan (@ZeeMohamed_) April 21, 2022
As many such images emerged from Delhi, it is ironical that the UK PM @BorisJohnson will inaugurate a JCB factory in Gujarat today.#borisinindia pic.twitter.com/2B7lDERk4Z
— Danish Khan (@DanishKhan80) April 21, 2022
JCB's website proudly notes that it is used for construction, agriculture, recycling and power generation.
In India, it is being used to disposess the poor and inflict collective humiliation upon Muslims.
Hope that friends in the UK will make hold their PM to account. Tag them. https://t.co/Jc7iX1ERpC pic.twitter.com/pjJF2wka9Y
— Alishan Jafri (@alishan_jafri) April 21, 2022
From Gandhi's Charkha to Modi's JCB – Boris Johnson covered the history of India from 1947 to 2022, in a day. pic.twitter.com/1N0Fcku3iT
— PuNsTeR™ (@Pun_Starr) April 21, 2022