న్యూఢిల్లీ : రైలు టికెట్ల బుకింగ్, రద్దు విషయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) చెక్ పెట్టింది. ఇందుకోసం ‘ఆస్క్ దిశ 2.0’ అనే ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. యాప్‌తోపాటు వెబ్సైట్లోనూ ఈ చాట్‌బాట్ అందుబాటులో ఉంది. యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించేందుకు తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా టికెట్ బుకింగ్, రద్దు, రిఫండ్ స్టేటస్‌తో పాటు ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.
హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ సహా పలు భాషల్లో అందుబాటులో ఉన్న వాయిస్ కమాండ్ ఆధారంగా సేవలను వినియోగించుకోవచ్చు. సాంకేతికత మీద అనుభవం లేని, టెక్ట్స్‌ను టైప్ చేయలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఐఆర్సీటీసీ పాస్‌వర్డ్‌ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓటీపీ ఆధారంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఫెయిలైనా, టికెట్లు క్యాన్సిల్ చేసినా రిఫండ్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేదు.