Bombay High Court : పోలీసుల (Police) పై బాంబే హైకోర్టు (Bombay High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్జీషీట్ల (Charge sheets) లో విట్నెస్ స్టేట్మెంట్ల (Witness Statements) ను కాపీ పేస్టింగ్ (Copy-Pasting) చేయడం కరెక్ట్ కాదని మండిపడింది. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులలో సైతం పోలీసులు విట్నెస్ స్టేట్మెంట్లను కాపీ పేస్టింగ్ చేస్తున్నారని అసహనం వ్యక్తంచేసింది.
అంతేగాక కీలకమైన విట్నెస్ స్టేట్మెంట్లను కాపీ పేస్టింగ్ చేయడం ‘ప్రమాదకర సంస్కృతి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులకు మేలు చేసేందుకు తోడ్పడే ఈ సంస్కృతికి ముగింపు పలుకాలని హెచ్చరించింది. బాంబే హైకోర్టుకు సంబంధించిన ఔరంగాబాద్ ధర్మాసనం ఓ క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. చార్జీషీట్లలోని విట్నెస్ స్టేట్మెంట్లలో పేరాగ్రాఫ్లు, మొదటి వర్డ్స్, చివరి వర్డ్స్ మక్కీకి మక్కీగా ఉండటాన్ని హైకోర్టు గుర్తించింది.
అత్యంత త్వరగా విట్నెస్ స్టేట్మెంట్ల కాపీ పేస్టింగ్ సంస్కృతిని విడనాడాలని, అందుకు సంబంధించి మహారాష్ట్ర సర్కారు మార్గదర్శకాలను విడుదల చేయాలని జస్టిస్ విభ కన్కన్వాడి, సంజయ్ దేశ్ముఖ్ల ధర్మాసనం ఆదేశించింది.