ED | ముంబై, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పౌరులను వేధించడం ఆపాల్సిన సమయం వచ్చిందన్న జస్టిస్ మిలింద్ జాదవ్.. ఈడీకి రూ.లక్ష జరిమానా విధించారు.
మహారాష్ట్రకు చెందిన రాకేశ్జైన్ అనే స్థిరాస్తి వ్యాపారి తమ మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించి మోసం చేశారంటూ ఆస్తి కొనుగోలుదారు ముంబైలోని విలే పార్లే పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తగిన ఆధారాల్లేకుండా ఈడీ మనీలాండరింగ్ పేరుతో విచారణ జరుపుతున్నట్లు తేల్చింది.