ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇవాళ విమాన ప్రమాదంలో మృతిచెందారు. అయితే ఆయన ప్రయాణించిన విమానం ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ ఏవియేషన్ కంపెనీది. బొంబార్డియర్ లియర్ జెట్ 45(Learjet 45) మోడల్ విమానం ఇది. లియర్‌జెట్ అనేది విమానాలు తయారు చేసే అమెరికా కంపెనీ. పుణె జిల్లాలోని బారామతి సమీపంలో ఇవాళ జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. అయితే గతంలో కూడా ఈ విమానం ప్రమాదానికి గురైంది.
2023 సెప్టెంబర్‌లో ఇదే ప్రైవేటు జెట్ రన్‌వేపై స్కిడ్ అయ్యింది. ముంబై విమానాశ్రయంలో జోరుగా వర్షం కురుస్తున్న వేళ.. ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్లేన్ ప్రమాదానికి గురైంది. సెప్టెంబర్ 2023లో జరిగిన ప్రమాదం గురించి ప్రభుత్వం గతంలో నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీన ఉదయం 11.32 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు ఉన్నది.
విశాఖపట్టణం నుంచి ముంబై వెళ్తున్న ఆ విమానం.. ఆరు మంది ప్రయాణికులతో బయలుదేరింది. పౌర విమానయానశాఖ నివేదిక ప్రకారం.. విశాఖపట్టణం నుంచి ఆ రోజున ఫ్లయిట్ నార్మల్‌గా టేకాఫ్ తీసుకున్నది. ఎటువంటి సమస్యలు లేకుండానే ప్రయాణం సాగించినట్లు తెలుస్తోంది. ముంబై టవర్‌తో కాంటాక్ట్ జరిగిన తర్వాత.. ల్యాండింగ్ కోసం ఆదేశాలు ఇచ్చారని, రన్‌వే 27పై దిగేందుకు ఆ విమానానికి క్లియరెన్స్ ఇచ్చారు. 11.31 నిమిషాలకు ల్యాండ్ కావాలని ఆదేశించారు. అయితే ల్యాండింగ్ సమయంలో.. ముంబై విమానాశ్రయంలో జోరుగా వర్షం కురుస్తోంది. దీంతో విజిబులిటీ తక్కువగా ఉన్నది.
ల్యాండింగ్ క్లియరెన్స్ సమయంలో గాలి వేగం “WIND 140 DEGREES 7 KTS RWY27 అని రిపోర్టులో ఉన్నది. అయితే గాలివాన జోరుగా ఉన్నప్పుడు రన్‌వే 27పై దిగేందుకు ప్లేన్ ప్రయత్నించింది, కానీ ఆ గాలివాన జోరుకు ఆ విమానం కాస్త పక్కకు జరిగినట్లు తెలుస్తోంది. ఆప్రాన్ సీ దిశగా ఆ విమానం మళ్లింది. సుమారు 40 సెక్షన్ల తర్వాత ఆటోపైలట్ డిస్కనక్ట్ అయ్యింది. ఈపీజీడబ్ల్యూఎస్ వార్నింగ్ జనరేట్ ఛేశారు. కానీ అప్పటికే విమానం క్రాష్ అయ్యింది. టాక్సీవే డబ్ల్యూ, టాక్సీవే ఎన్.. కూడలి వద్ద విమానం కూలింది.
ఆ ప్రమాదంలో ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయల్ ట్యాంకు రెండు ముక్కలైంది. విమానం రన్‌వే నుంచి స్కిడ్ అయ్యింది. ఆ ముక్కలు టాక్సీవే యూ, టాక్సీవే ఎన్ వద్ద ఆగిపోయాయి. ప్రమాదం వల్ల మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటల్ని ఆర్పారు. ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల్ని తరలించారు. వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీప ఆస్పత్రిలో వాళ్లను చేర్పించారు. ముందస్తు చికిత్స తర్వాత ప్రయాణికుల్ని, పైలట్‌ను డిశ్చార్జ్ చేశారు.
ఆ రోజు జరిగిన ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. విమానంకు చెందిన ముక్కు భాగం చాలా డ్యామేజ్ అయ్యింది. ఆ విమాన రెక్క ఒకటి విడిపోయింది. ముందు భాగంలోని ఇంధన ట్యాంక్.. మరో ట్యాంక్‌తో దూరమైంది. నోస్ ల్యాండింగ్ గియర్, మెయిన్ ల్యాండింగ్ గియర్ విరిగిపోయినట్లు సివిల్ ఏవియేషన్ శాఖ తన రిపోర్టులో పేర్కొన్నది.