బాంబు పెట్టామని బెదిరింపు..! పాఠశాలను ఖాళీ చేయించిన యాజమాన్యం..!
Bomb threat | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో యాజమాన్యం పాఠశాలను
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో భయాందోళనకు గురైన యాజమాన్యం పాఠశాలను ఖాళీ చేయించింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. పాఠశాలలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఆ తర్వాత ఎలాంటి బాంబును దొరక్క పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు. బీఆర్టీ మార్గ్‌లోని సాదిక్ నగర్లో ఉన్న పాఠశాల అధికారిక ఈ-మెయిల్ ఐడీకి పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు మధ్యాహ్నం 1.19 గంటలకు మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే విద్యార్థులను ఖాళీ చేయించారు.
స్కూల్ మొత్తం వెతికినా బాంబు దొరకలేదని తెలిపారు. సైబర్ బృందం ఈ-మెయిల్ చెక్ చేసిందని, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని బాంబు కోసం గాలించాయి. ఎలాంటి బాంబు దొరక్క పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆకతాయిల పనై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

