Bomb threat | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులో పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాఠశాలలు, ఐజీఐ ఎయిర్పోర్ట్కి సైతం బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్స్ పంపారు. తాజాగా మంగళవారం ఉదయం నగరంలోని నాలుగు హాస్పిటల్కు బెదిరింపులు వచ్చాయి. సాయంత్రం సమయంలో తిహార్ జైలును పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు అధికారులకు మెయిల్ పంపారు. ఈ మేరకు జైలు అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు.
బాంబు బెదిరింపుల నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్న ఫెసిలిటీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇవాళ ఉదయం నాలుగు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయిన ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. జీటీబీ హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెడ్గేవార్ హాస్పిటల్, దీప్చంద్ర బంధు హాస్పిటల్కు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఫైర్ సర్వీసు అధికారులు తెలిపారు. బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అగ్నిమాపక దళం, బాంబు డిటెక్షన్ టీమ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్థానిక పోలీసు బలగాలు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పద వస్తువులు ఏమీ గుర్తించలేదని హెడ్గేవార్ ఆసుపత్రి భద్రతా అధికారి వీకే శర్మ చెప్పారు. ఢిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలకు బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి. మే 12న దాదాపు 20 ఆసుపత్రులకు బెదిరింపులు వచ్చాయి. అదే రోజు ఇందిరాగాంధీ విమానాశ్రయానికి సైతం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అయితే, అవన్నీ తప్పని తేలింది. మే 1న ఢిల్లీలోని వంద పాఠశాలలు, నోయిడాలోని రెండు, లక్నోలోని పాఠశాలకు సైతం బెదిరింపులు వచ్చాయి. ఈ అయితే, వ్యవహారంలో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.