Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి నివాసానికి (Chief Minister’s residence) బాంబు బెదిరింపులు వచ్చాయి. సీఎం కార్యాలయంతోపాటు బెంగళూరులోని కోరమంగళలో గల రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి (Bengaluru passport office) కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సీఎం నివాసం, పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి బాంబర్లు దాడి చేస్తారని హెచ్చరించారు.
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం 3:15 గంటల ప్రాంతంలో దాడికి ప్రణాళిక వేసినట్లు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్‌పై అప్రమత్తమైన పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
PM Modi: మానవత్వంపై పాకిస్థాన్ దాడి చేసింది: ప్రధాని మోదీ
Vande Bharat Express: కోల్డ్ వెదర్ తట్టుకునేరీతిలో.. కశ్మీర్ వందేభారత్ రైలు
NEET PG 2025 | నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు ఓకే