NEET PG 2025 | నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు ఓకే
NEET PG 2025 | నీట్-పీజీ-2025 (NEET PG 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఆమోదం తెలిపింది.
NEET PG 2025 | నీట్-పీజీ-2025 (NEET PG 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఆమోదం తెలిపింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో జరపడానికి పర్మీషన్ కోరుతూ ఎన్బీఈ ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్బీఈఎంఎస్ అభ్యర్థనను తిరస్కరించింది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించడానికి నిరాకరించింది. దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. అందుకే ఒకే షిఫ్ట్‌లో పరీక్షను ముగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పరీక్ష ఒకే షిఫ్టులో జరపడానికి మరింత సమయం కావాలని బోర్డు కోరింది. ఈ క్రమంలో ఈ నెల 15న జరగవలసిన నీట్-పీజీ, 2025ను వాయిదా వేస్తున్నట్లు ఎన్బీఈఎంఎస్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
మే 30న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు తమ టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ సాధ్యమైనంత త్వరగా పరీక్షను నిర్వహించడానికి అనువైన తేదీగా ఆగస్టు 3ని నిర్ణయించిందని, ఈ తేదీన పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్బీఈ సుప్రీంకోర్టును కోరింది. రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకేషిఫ్టులో పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా జూన్ 15న నిర్వహించాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్బీఈ తెలిపింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 3వ తేదీన పరీక్ష జరపడానికి అవకాశం కల్పించింది. నీట్ పీజీ-2025 పరీక్ష ద్వారా ఎంఎస్ కోర్సులో 12,690, ఎండీ కోర్సులోని 24,360, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్లను భర్తీ చేయనున్నారు.
Also Read..
“NEET PG 2025 | ఆగస్టు 3న నీట్-పీజీ..! అనుమతి కోరుతూ సుప్రీంకోర్టుకు ఎన్బీఈ”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

