ముంబై: ఓ బాలీవుడ్ నటి(Bollywood Actress)ని వేధించారు. మూవీ ఫైనాన్సర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ నటి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ నటి పేరును ఇంకా రిలీజ్ చేయలేదు. ముంబైలోని జూహూ పోలీసు స్టేషన్లో కేసును రిజిస్టర్ చేశారు. ఓ వీడియో చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పి ఆ ఫైనాన్సర్ నటిని వేధించినట్లు(molestation) తెలుస్తోంది. కానీ ఆ నటి తిరగబడింది. దీంతో ఆ వ్యక్తి ఆమెను తిట్టినట్లు తెలుస్తోంది. చంపేస్తానంటూ కూడా ఆమెను ఆ వ్యక్తి బెదిరించాడు. ఐపీసీ 354, 506, 509 సెక్షన్ల కింద కేసును బుక్ చేసి విచారిస్తున్నారు.