Bhubaneswar | కాలర్ పట్టి ఈడ్చుకెళ్లారు.. భువనేశ్వర్ మున్సిపల్ అధికారిపై బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యం
ఒడిశాలో అధికార బీజేపీ నేతలు పేట్రేగి పోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ కార్యాలయాల్లోనే దాడులకు దిగుతున్నారు. ఓ మున్సిపల్ అధికారిని అంతా చూస్తుండగానే తన చాంబర్ నుంచి గల్లా పట్టి గుంజుకొచ్చి విచక్షణా రహితంగా దాడిచేశారు.
భువనేశ్వర్: ఒడిశాలో అధికార బీజేపీ నేతలు పేట్రేగి పోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ కార్యాలయాల్లోనే దాడులకు దిగుతున్నారు. ఓ మున్సిపల్ అధికారిని అంతా చూస్తుండగానే తన చాంబర్ నుంచి గల్లా పట్టి గుంజుకొచ్చి విచక్షణా రహితంగా దాడిచేశారు. రత్నాకర్ సాహూ (Ratnakar Sahoo) అనే అధికారి భువనేశ్వర్ (Bhubaneswar) మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం విధులకు హాజరైన ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో బీఎంసీ ఆఫీస్‌కు వచ్చిన ఆరుగురు ఆయనను తన చాంబర్లో ఈడ్చుకెళ్లారు.

అనంతరం అక్కడికి చేరుకున్న బీఎంసీ కార్పొరేటర్ జీవన్ రౌత్.. జగ్ భాయ్ (బీజేపీ నాయకుడు జగన్నాథ్ ప్రధాన్)తో అమర్యాదగా ప్రవర్తిస్తావా అని అధికారిని చేయిచేసుకున్నాడు. దీంతో ఆయన అనుచరులు ఆ అధికారిని తన చాంబర్లో నుంచి కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చారు. మొహంపై పిడిగుద్దులు గుద్దుతూ మెట్లపై నుంచి కిందికి తోసేశాడు. దీంతో పడిపోయిన ఆయనను గల్లా పట్టుకుని అలాగే ఈడ్చుకెళ్లారు. ఛాతీపై కాలుతో తన్నారు. బలవంతంగా కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకులను ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.

కాగా, తనపై దాడి చేసిన బీజేపీ నాయకులు, బలవంతంగా వారి వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని సాహూ తెలిపారు. తాను ఎవరితో అమర్యాదగా ప్రవర్తించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. కార్పొరేటర్ జీవన్ రౌత్‌తోపాటు ఆయన అనుచరులను అరెస్టు చేశారు.
I am utterly shocked seeing this video.
Today, Shri Ratnakar Sahoo, OAS Additional Commissioner, BMC, a senior officer of the rank of Additional Secretary was dragged from his office and brutally kicked and assaulted in front of a BJP Corporator, allegedly linked to a defeated… pic.twitter.com/yf7M3dLt9C
— Naveen Patnaik (@Naveen_Odisha) June 30, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

