BMC Exit Polls : భారత దేశంలోనే అత్యంత ధనిక మున్సిపాలిటీగా పేరొందిన మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల చూపుడు వేలికి సిరా గుర్తు బదులు మార్కర్ ఉపయోగించి గుర్తు పెట్టడంపై వివాదం మినహా 227 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలక్షన్ ముగియడంతో ఫలతాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి కూడా బీజేపీ కూటమిదే హవా అంటున్నాయి కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేశాయి.
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్‌లోని 227 స్థానాలుకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార బీజేపీ కూటమి, ఠాకరే సోదరుల మధ్యనే ఉండనుంది. అయితే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మాత్రం బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని ‘యాక్సిస్ మై ఇండియా’ (Axis My India), జేవీసీ (JVC) సంస్థలు అంటున్నాయి. కమల కూటమికి 138 సీట్లు ఈ సంస్థల సర్వే చెబుతోంది. శివసేన యూబీటీ కూటమి 59 సీట్లకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్ కూటమి 23 సీట్లు, ఇతరులకు 7 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది.
BMC – Exit Poll – Seat Share – Vote Share (%)#BMCElections2026#ExitPoll2026#AxisMyIndia pic.twitter.com/xE535uMm3B
— Axis My India (@AxisMyIndia) January 15, 2026
జన్మత్ సంస్థ ప్రకారం బీజేపీ కూటమి 138, శివసేన 62, కాంగ్రెస్ 20, ఇతరులు 7 స్థానాలు గెలుస్తారు. ఇక టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. బీజేపీ కూటమి 129-146, కాంగ్రెస్ 21-25, ఇతరులు 11-15 సీట్లు గెలుస్తారు. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం బీజేపీ కూటమి 119 సీట్లు గెలుచుకుంటుంది.