న్యూఢిల్లీ : దక్షిణాది వంటకాలంటే ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. ముఖ్యంగా సదరన్ స్పైసీ మసాలా దోశ, వడలు, సాంబార్లను ఉత్తరాది వారు సైతం ఇష్టంగా ఆరగిస్తుంటారు. ఇక ఫుడ్ ఎక్స్‌పరిమెంట్స్‌తో వెరైటీ కాంబినేషన్లను వైరల్ చేస్తుండగా లేటెస్ట్గా బ్లూ పీ దోశ (Blue Pea Dosa) ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. దోశ పిండిలో శంఖుపుష్పం పొడిని కలపడం ద్వారా తయారైన ఈ బ్లూ దోశ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.
జ్యోతీజ్ కిచెన్ అనే ఇన్స్టాగ్రాం ఖాతాలో ఈ రీల్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి కొన్ని పూలను మరిగించగా కొద్దిసేపటకి ఆ నీరు బ్లూ కలర్లోకి మారడం చూడొచ్చు. ఆపై దీన్ని ఓ బౌల్లోకి తీసుకుని దోశ పిండిని కలుపుతారు. ఇక పెనంపై ఈ పిండిని వేసి బ్లూ దోశలను తయారుచేయడం కనిపిస్తుంది. ఆపై వేడి వేడి దోవను వివిధ రకాల చట్నీలతో సిద్ధం చేశారు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 10 లక్షల వ్యూస్ లభించగా ఈ క్లిప్‌పై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. ఈ దోశను టేస్ట్ చేయాలని కొందరు ఉత్సుకత చూపగా ఇదేం కాంబినేషన్ అంటూ మరికొందరు పెదవివిరిచారు. ఇక దేవతార్చనలో విరివిగా వాడే శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు.
Read More :