Health tips | ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Health tips | ఇప్పుడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య పెరగకుండా ఉంటుంది..? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత ముదురుతుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య పెరగకుండా ఉంటుంది..? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత ముదురుతుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సమస్యను తగ్గించే పదార్థాలు
వెల్లుల్లి
కాలేయ వాపు (ఫ్యాటీ లివర్) సమస్యపై చేసిన ఆనేక పరిశోధనల ప్రకారం.. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయట పడాలంటే వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితోపాటు ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఉన్నాయి.
గ్రీన్ టీ
ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉన్న గ్రీన్ టీ కూడా మెరుగ్గా పని చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో తోడ్పడుతాయి. అదేవిధంగా మన శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను తొలగించి ఫ్యాటీ లివర్ని సమస్యను తగ్గించడంలో కూడా ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
అవకాడో
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారికి అవకాడో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించి కాలేయాన్ని ఎంతో సురక్షితంగా ఉంచడంతోపాటు బరువు తగ్గడానికి దోహదపడుతాయి.
సమస్యను పెంచే పదార్థాలు
పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్
కాలేయంలో వాపు సమస్య ఉన్నవాళ్లు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడంవల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయి. చక్కెరలు పెరిగినప్పుడు కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దాంతో ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.
చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్
చక్కెరలు ఎక్కువగా ఉండే చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ లాంటి పదార్థాలు కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ప్రమాదకరం. వాటితో కాలేయంలో చక్కెరలు చేరి ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

