Diabetes | న్యూఢిల్లీ, జూలై 20: గాఢ నిద్రకు, శరీరంలోని షుగర్ లెవెల్స్‌కు సంబంధం ఉందా.. అంటే ఉందనే అంటున్నారు కొందరు పరిశోధకులు. గాఢంగా నిద్రపోతున్నప్పుడు మన మెదడు విడుదల చేసే తరంగాలు శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధం చేసి మరునాటికి రక్తంలోని చక్కెర స్థాయిని అంచనా వేస్తుందని వారు తెలిపారు.
నిద్రలేమి వల్ల మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వారు వెల్లడించారు. మెదడు నుంచి వెలువడిన రెండు తరంగాల సమ్మేళనం శరీరంలోని ఇన్సులిన్ తీవ్రతను అంచనా వేస్తుందని సీనియర్ శాస్త్రవేత్త మాథ్యూ వాకర్ తెలిపారు.