అగ్గువకే బ్లడ్ క్యాన్సర్ చికిత్స!
క్యాన్సర్‌కు టీ-సెల్ థెరపీ అనే చికిత్స ఉందనే విషయం తెలిసిందే. కీమోథెరపీ వంటి చికిత్సలో ఉండే దుష్ప్రభావాలు సెల్ థెరపీలో ఉండవు. చాలా సురక్షితం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
- టీ-సెల్ థెరపీ ఇక కారుచౌక
- అమెరికా ఖర్చులో 10 శాతమే
- ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు
- రెండేండ్లలో పూర్తిగా అభివృద్ధి
- దుష్ప్రభావాలు లేకుండా చికిత్స
క్యాన్సర్‌కు టీ-సెల్ థెరపీ అనే చికిత్స ఉందనే విషయం తెలిసిందే. కీమోథెరపీ వంటి చికిత్సలో ఉండే దుష్ప్రభావాలు సెల్ థెరపీలో ఉండవు. చాలా సురక్షితం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందరూ భరించలేని పరిస్థితి. అయితే మన దగ్గర అగ్గువకే రక్త క్యాన్సర్ (లుకేమియా)కు చికిత్స అందజేస్తామని పలు ఫార్మా, స్టార్టప్ కంపెనీలు చెబుతున్నాయి.
సెల్ థెరపీ ఆధారిత చికిత్సకు అమెరికాలో అయ్యే ఖర్చులో 10 శాతానికే ఇక్కడ చికిత్స అందజేస్తామని పేర్కొంటున్నాయి. వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేస్తున్నాయి. కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ-సెల్ (సీఏఆర్ టీ-సెల్) థెరపీ అని పిలిచే చికిత్సకు అమెరికాలో దాదాపు రూ.6 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ అద్భుతమైన చికిత్స ఇక్కడ 10 శాతానికే అందుబాటులోకి రానున్నది.
సీఏఆర్ టీ కణాలంటే..?
ఈ సీఏఆర్ టీ-కణాలు ఏం చేస్తాయంటే మన శరీరంలో వ్యాధినిరోధకతను కలిగించే టీ-కణాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇవి మన శరీరంలోని వయసైపోయిన కణాలు, క్యాన్సర్ వంటి అసహజ కణాలను ఏరివేస్తాయన్న మాట.
థెరపీలో ఏం చేస్తారు?
సెల్యులార్ ఇమ్యునోథెరపీ వంటి చికిత్స పద్ధతుల్లో రోగి వ్యాధి నిరోధక కణాలను తీసుకుంటారు. తర్వాత ఏదైనా వ్యాధిపై పోరాడేలా కణాల్లో జన్యుపరమైన మార్పులు చేస్తారు. అప్పుడు వాటిని తిరిగి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు. వారం రోజుల తర్వాత ఆ కణాలు వాటి పని ప్రారంభిస్తాయి. చాలా సంవత్సరాల పాటు వాటి ప్రభావం చూపిస్తుంటాయి.
ఎవరెవరి భాగస్వామ్యం
బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ మద్దతుతో నడుస్తున్న ఇమ్యూనెల్ థెరప్యూటిక్స్, అమెరికా క్యాన్సర్ నిపుణుడు సిద్ధార్థ ముఖర్జీ, రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఐఐటీ బాంబేకు చెందిన స్పిన్ఆఫ్, షెం జెన్ ప్రీజీన్ బయోఫార్మా(చైనా), ఇమ్యునోయాక్ట్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నాయి.

సెల్ థెరపీ విధానం ఇలా..
టీ-సెల్స్ సేకరణ: రోగి రక్తంలోని తెల్ల రక్త కణాల్లో ఒక రకమైన టీ-సెల్స్‌ను సేకరిస్తారు.
జన్యుపరమైన మార్పులు: క్యాన్సర్ కణాలను గుర్తించి చంపే విధంగా ఈ టీ-సెల్స్‌లో జన్యుపరమైన మార్పులు (జెనెటికల్ ఇంజినీరింగ్) చేస్తారు.
సీఏఆర్టీ-సెల్స్ పెంపు: రీ ఇంజినీర్ చేసిన కణాలను క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి సరిపడా కొన్ని లక్షల సంఖ్యలో వృద్ధి చేస్తారు.
తిరిగి ఎక్కించడం: లక్షల కొద్ది టీ-కణాలను తిరిగి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు. దీంతో రోగి లోపల ఉన్న క్యాన్సర్ కణాలను ఈ టీ-కణాలు గుర్తించి అన్నింటినీ చంపేస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

