న్యూఢిల్లీ: డయాబెటిస్, వయసు మీద పడటం ద్వారా తలెత్తే ఆరోగ్య సమస్యలు, మెటబాలిజం సమస్యలతో రెటినాలో కొవ్వు పోగుబడి డయాబెటిక్ రెటినోపతికి దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు. ముందు ముందు కంటి చూపు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందని పరిశోధకులు తమ నివేదికలో పేర్కొన్నారు. వీరి అధ్యయనాన్ని ‘డయాబెటాలిజియా’ జర్నల్ తాజాగా ప్రచురించింది. రెటినాపై కొవ్వును ముందుగా గుర్తించటం ద్వారా ఈ సమస్యను ఎదుర్కొనవచ్చునని, టైప్-1, టైప్-2 డయాబెటిస్‌లో అత్యధికమంది పేషెంట్లు అంధత్వం బారినపడే ముప్పును తప్పించవచ్చునని నివేదిక తెలిపింది.