న్యూఢిల్లీ, మే 4: పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో ఆదివారం రాత్రి 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు అరగంట పాటు అన్ని లైట్లను ఆఫ్ చేసి పూర్తి బ్లాకవుట్ పాటించారు. యుద్ధ ముప్పు నేపథ్యంలో బాకవుట్ అమలులో సన్నద్ధతను, సమర్థతను పరీక్షించేందుకు ఈ రిహార్సల్స్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
అరగంట పాటు ఎవరూ లైట్లు వేయొద్దని ప్రజలను కోరారు. ఈ మేరకు బ్లాకవుట్ గురించి లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు పలు సూచనలు చేసి, అది తప్పక పాటించాలని కోరారు.