MNM party : నరేంద్రమోదీ సర్కారు ఇవాళ లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు బిల్లుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని మండిపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గిపోతుందని అంటున్నాయి.
తమిళనాడులో కూడా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. సీఎం స్టాలిన్ ఈ ఉదయం బిల్లుకు సంబంధించిన ప్రతులకు నిప్పుపెట్టారు. ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతులను తగులబెట్టారు. అదేవిధంగా సినీ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మైయం పార్టీ కూడా నిరసన వ్యక్తంచేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నల్లజెండా ఎగురవేసింది.
#WATCH | Chennai, Tamil Nadu: Black flag hoisted at Makkal Needhi Maiam (MNM) headquarters in Chennai as part of the statewide protest against the proposed Delimitation Bill.
(Source: MNM) pic.twitter.com/pqNT5DfObM
— ANI (@ANI) April 16, 2026