(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మలేషియా పోలీసులు నల్లుల సాయంతో నేరగాళ్లను సులభంగా పట్టుకొంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మనుషుల రక్తాన్ని నల్లులు పీలుస్తాయన్న విషయం తెలిసిందే. అలా పీల్చిన రక్తం ద్వారా నల్లుల శరీరంలో మనుషుల డీఎన్ఏ 45 రోజులపాటు ఉంటుందని సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా పరిశోధకులు కనుగొన్నారు.
నల్లులు సాధారణంగా 6 మీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించవు. దీంతో క్రైమ్ జరిగిన చోట ఒకవేళ నేరస్తుడిని నల్లులు కుట్టినట్టయితే, దాని రక్తంలోని డీఎన్ఏ ద్వారా అసలైన నిందితులను పట్టుకోవచ్చు.