కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి వద్ద (RG Kar Hospital) కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన ఆయన ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార సంఘటన తర్వాత జరిగిన మూక దాడిపై ఆయన మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన గూండాలు రెచ్చిపోయారని, లేడీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఆసుపత్రిపై దాడి చేశారని ఆరోపించారు. నిరసన చేస్తున్న డాక్టర్లను భయాందోళనకు గురి చేసినట్లు విమర్శించారు.
కాగా, వికృత గుంపు అర్ధరాత్రి వేళ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని సువేందు అధికారి ఆరోపించారు. వారి దాడికి భయపడిన పోలీసులు టాయిలెట్లలో దాక్కున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జీ కర్ హాస్పిటల్లో సాక్ష్యాలను మరింతగా ధ్వంసం చేయకుండా నిరోధించేందుకు కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలను మోహరించాలని కేంద్ర హోంశాఖ కోరినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.
The WB Govt & @KolkataPolice have turned RG Kar Medical College and Hospital into a stinky quagmire by firstly allowing culprits to establish their fiefdom of crime and now allowing TMC goons to stomp upon the whole premises to destroy evidence (whatever was left of it) and scare… pic.twitter.com/5xQ5BljoGE
— Suvendu Adhikari (@SuvenduWB) August 15, 2024