Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రానున్న ఎన్నికలకు నార్త్ మహారాష్ట్రలోని జలగావ్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీజేపీ ఎంపీ ఉన్మేష్ పాటిల్ బీజేపీకి రాజీనామా చేశారు.
కాషాయ పార్టీని వీడిన పాటిల్ బుధవారం శివసేన (యూబీటీ)లో చేరారు. పార్టీ చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో ఉన్మేష్ పాటిల్ తన సహచరులతో కలిసి సేనలో చేరారు.
పాటిల్ శివసేన (యూబీటీ)లో చేరడంతో జలగావ్ ప్రాంతంలో బీజేపీకి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. పాటిల్ రాకతో శివసేన (యూబీటీ)లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని, ఆయన చేరికతో పార్టీ కార్యకర్తల మనోస్ధైర్యం పెరుగుతుందని సేన వర్గాలు పేర్కొన్నాయి.
Read More :
Sushil Modi | గత 6 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నాను.. సుశీల్ మోదీ సంచలన ప్రకటన