న్యూఢిల్లీ: బీజేపీ విద్వేష రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. విద్వేష రాజకీయాలవల్ల పరోక్షంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆన్లైన్ క్విజ్ ద్వారా బీజేపీ ప్రభుత్వంపై ఎటాక్ చేసిన రాహుల్‌గాంధీ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ విద్వేష రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదకరం. ఈ విద్వేష రాజకీయాలు దేశంలో నిరుద్యోగిత పెరుగడానికి కూడా కారణమవుతుంది అని రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. సమాజంలో శాంతి లేకుండా దేశీయ, విదేశీ పరిశ్రమలు నడువడం కష్టం. మీ చుట్టూ పొంచి ఉన్న విద్వేషాన్ని సోదరభావంతో ఓడించాలి. ఆర్ యూ విత్ మీ..? యాష్ నో హేట్ అని రాహుల్‌గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అంతేగాక, శనివారం ఒక ఆన్లైన్ క్విజ్ ద్వారా రాహుల్‌గాంధీ బీజేపీపై దాడిచేశారు. బీజేపీ ప్రభుత్వం ఏ అంశంలో ప్రధానంగా విఫలమైందని ప్రశ్నిస్తూ.. నిరుద్యోగం, పన్నుల ఎగవేత, ధరల పెరుగుదల, విద్వేష వాతావరణం అనే నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.