కోల్కతా, సెప్టెంబర్ 12: కేంద్రమంత్రి సుభాష్ సర్కారుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. ఆయన నియంతృత్వ పోకడలపై బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బంకురా జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిర్బంధించారు. పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు తాళం వేయటం సంచలనం సృష్టించింది. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కేంద్రమంత్రి ఓ సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది సేపటికి కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ అనుచరులు అక్కడికి చేరుకోవటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దీంతో అక్కడ కొద్ది గంటలపాటు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కలుగజేసుకొని పార్టీ కార్యాలయం నుంచి కేంద్రమంత్రిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది.