BJP | ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో బీజేపీ మహిళా కార్యకర్తలు రోడ్డెక్కి ఒకరినొకరు ఇష్టమున్నట్టు కొట్టుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా, ఇతర నాయకుల ఆధ్వర్యంలో బుధవారం జలౌన్ జిల్లాలో ఏర్పాటుచేసిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమం రసాభాసగా మారింది. బీజేపీ మహిళా కార్యకర్తల్లో కొంతమంది నడిరోడ్డుపైకి వచ్చి.. ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని ఇష్టమున్నట్టు కొట్టుకున్నారు.
పురుషులు కూడా మహిళల వీపులపై ఇష్టమున్నట్టు బాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. యోగి పాలన ఎంత అధ్వానంగా ఉందో ఈ ఘటన తెలుపుతోందంటూ ప్రతిపక్షాలు ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ మండిపడ్డాయి. తమ పార్టీ కార్యకర్తలకు సీఎం యోగి ముందు క్రమశిక్షణ నేర్పించాలని సమాజ్వాదీ పార్టీ విమర్శించింది.