కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని బీజేపీ మద్దతురాలైన మహిళ ఆరోపించింది.(rape inside Trinamool office) ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు, అతడి అనుచరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రాజకీయ ప్రేరేపిత ఆరోపణగా ఆయన ఖండించాడు. కౌంటర్‌గా ఆ మహిళపై ఫిర్యాదు చేశాడు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ మద్దతురాలైన తనను, తన భర్తను నారాయణగంజ్ గ్రామాధిపతి అయిన టీఎంసీ నేత లక్ష్మీ షీట్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఒక మహిళ విమర్శించింది.
కాగా, ఆదివారం టీఎంసీ కార్యాలయానికి తన భార్యను పిలిపించారని, వృద్ధులైన లక్ష్మీ షీట్, అతడి అనుచరుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ మహిళ భర్త ఆరోపించాడు. ఆ మహిళ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు మహిళ ఆరోపణలను లక్ష్మీ షీట్ ఖండించాడు. రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆరోపించాడు. బీజేపీ తనను వేధిస్తున్నదని, అందుకే ఆ పార్టీ మద్దతురాలైన మహిళ ద్వారా కేసులో తనను ఇరికించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.