బీజేపీ లాంటి పార్టీలు వస్తుపోతుంటాయని, కాంగ్రెస్ మాత్రం ఎప్పటికీ నిలిచే వుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అయ్యారు. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, కానీ కాంగ్రెష్ అలా కాదని, ఎప్పటికీ నిలిచే వుంటుందన్నారు. ఈ సందర్భంగా వీరప్ప మొయిలీ మాజీ ప్రధాని నెహ్రూను ఉటంకిస్తూ.. వెనుకబడిన వర్గాలు, పేద ప్రజల కోసం పనిచేయడం ఎప్పుడైతే కాంగ్రెస్ ఆపేస్తుందో.. అప్పుడే కాంగ్రెస్ చచ్చిపోయినట్లు లెక్క. కాంగ్రెస్ నేతలందరూ పేద ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఆశలు కోల్పోకూడదు అంటూ మొయిలీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలంటే కచ్చితంగా నేతల మానసిక స్థితి మారాల్సిందేనని మోయిలీ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో లేదంటే. కార్యకర్తలు భయపడాల్సిన పనేం లేదు. బీజేపీ లాంటి పార్టీలు ప్రయాణికుల లాంటి పార్టీలు. వస్తూ పోతుంటాయి. కాంగ్రెస్ ఒక్కటే ఎప్పటికీ నిలిచి వుంటుంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతల మనస్తత్వాలు మారాల్సిందే అంటూ వీరప్ప మొయిలీ అన్నారు.