భోపాల్: తన ఆఫీసులో కేంద్ర సామాజిక, సాధికారత శాఖమంత్రి వీరేంద్ర కుమార్ పెట్టిన బోర్డులు ఆసక్తికరంగా మారాయి. ‘ఇచ్చట కాళ్లు పట్టుకోవడం నిషేధం’ అంటూ మధ్యప్రదేశ్ టికమ్గఢ్లోని తన ఆఫీసులో వీరేంద్ర కుమార్ బోర్డులు ఏర్పాటు చేశారు.
‘కాళ్లు మొక్కిన వారి పని జరగదు’ అని సైతం ఆయన స్పష్టం చేస్తూ బోర్డులు పెట్టారు. రాజకీయాల్లో ఎక్కువగా కనిపించే కాళ్లు పట్టుకునే సంస్కృతికి భిన్నంగా వీరేంద్ర పెట్టిన ఈ బోర్డులు ఆయన ఆఫీసుకు వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. టికమ్గఢ్ నుంచి వరుసగా నాలుగుసార్లు వీరేంద్ర ఎంపీగా గెలిచారు.