న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు(BJP President) రానున్నారు. ఈనెల 19వ తేదీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 20వ తేదీన పార్టీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. బీజేపీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్ కే లక్ష్మణ్ ఆ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జనవరి 19వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేసుకోవాలి. ఇక సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నామినేషన్ విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ అవసరం అయితే పోలింగ్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామన్నారు. అయితే పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ జాతీయ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబిన్ ఆ పదవిని గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా స్థానంలో నబిన్ ఆ బాధ్యతలు చేపట్టే ఛాన్సు ఉన్నది. నితిన్ నబిన్‌కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అండ ఉన్నది.
भारतीय जनता पार्टी के ‘संगठन पर्व’ के अंतर्गत राष्ट्रीय चुनाव अधिकारी डॉ. के. लक्ष्मण जी द्वारा भाजपा के राष्ट्रीय अध्यक्ष के निर्वाचन की आधिकारिक घोषणा।
निर्वाचन की प्रक्रिया 19 जनवरी से शुरू होकर 20 जनवरी 2026 तक पूर्ण होगी। pic.twitter.com/okmljzwzED
— BJP (@BJP4India) January 16, 2026