జైపూర్: రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఆ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేసింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇచ్చింది. రాజస్థాన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. సరైన బలం లేనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అయితే ప్రతిపక్షానికి చెందిన ధోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా (Shobha Rani Kushwaha).. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ముగ్గురు అభ్యర్థులులైన రన్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ గెలిపించుకోగా, బీజేపీ ఒక స్థానంతోనే సరిపెట్టుకున్నది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశారు.

2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యే రాణి కుశ్వాహా ఇదే తరహాలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అప్పడు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేశారు. అయితే కావాలని ఓటేయలేదని, పొరపాటు జరిగిందని చెప్పటడంతో అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అయితే ఇప్పుడు కూడా అదేతరహాలో కాంగ్రెస్‌కు ఓటేయడంతో బీజేపీ పార్టీ నుంచి వేటువేసింది.
BJP suspended its Rajasthan MLA Shobharani Kushwaha from the party's primary membership for cross-voting in favour of Congress candidate Pramod Tiwari in the #RajyaSabhaElections
She has been given 7 days time to clarify why she voted against the whip: Rajasthan LoP GC Kataria pic.twitter.com/a2mEgxvwz2
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 11, 2022