రాయ్‌పూర్, జూలై 8: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్ఛరించారు. రాష్ట్రపతిని ముర్మజీగా సంబోధించారు. వెంటనే తన తప్పును తెలుసుకున్న ఖర్గే.. ముర్ముజీ అని సరిదిద్దుకున్నారు.
కొన్ని సెకండ్ల తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోవిడ్‌గా ఉచ్ఛరించి మళ్లీ అదే తప్పు చేశారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ స్థాయిలో చెట్ల నరికివేత సమస్యపై ప్రసంగించిన ఖర్గే తన పారిశ్రామిక మిత్రుల కోసం బీజేపీ భూకబ్జాకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్ఛరించడంపై ఖర్గేపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక, గిరిజన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయనపై మండిపడింది.