పాట్నా, ఫిబ్రవరి 28: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ను చూసి బీజేపీ భయపడుతున్నదని, అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి విమర్శించారు. 30 ఏండ్ల నుంచి తాము ఎన్నో ఆరోపణలను ఎదుర్కొంటున్నామని, అయినా ఎక్కడికీ పారిపోబోమని తెలిపారు. అవినీతి, అక్రమాలతో అడ్డగోలుగా ఆస్తులను కూడబెట్టుకుని విదేశాలకు పారిపోతున్న వారందరికీ ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు.
‘ఉద్యోగానికి భూమి’ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లాలూ, రబ్రీదేవితోపాటు మరో 14 మందికి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.