Mamata Banerjee : కోల్‌కతాలో వైద్య విద్యార్ధినిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అంతటా నిరసన ప్రదర్శనలు, అలజడి కొనసాగుతున్న క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ విమర్శలు గుప్పించారు. హిట్లర్ తర్వాత ఇవాళ ఎవరైనా నియంత ఉన్నారంటే మమతా బెనర్జీ మాత్రమేనని ఆరోపించారు.
బెంగాల్లో ఎంతటి అరాచక పరిస్ధితులు ఉన్నాయో కోల్‌కతా ఘటన కండ్లకు కట్టిందన్నారు. పోలీసులు, సంఘవిద్రోహశక్తులు, రాజకీయ నేతల మధ్య సంబంధాలను ఈ ఘటన బట్టబయలు చేసిందని అన్నారు. కోల్‌కతా ఘటనలో నిందితుడు పోలీస్ వాహనంలో వెళ్లడం, నిందితుడు స్వయంగా సోషల్ పోలీస్ సభ్యుడు కావడం విస్మయం కలిగిస్తోందని చెప్పారు.
పోలీస్ విభాగంలో పనిచేసే వ్యక్తి హత్యాచారాలకు పాల్పడితే ఇక మహిళల భద్రత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడం సిగ్గుచేటని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కరవైన క్రమంలో దీదీ ముఖ్యమంత్రి స్ధానంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదని, అక్కడ మమతా బెనర్జీ చెప్పిందే సరైనదని అన్నారు.
Read More :
Terrorist | రామేశ్వరం కేఫ్ తరహాలో రైళ్లపై దాడులకు కుట్ర.. కలకలం సృష్టిస్తోన్న పాక్ ఉగ్రవాది వీడియో