అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. చిత్తుగా ఓడిన కాంగ్రెస్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. హిమంత బిశ్వశర్మ పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. 126 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 102 సీట్లతో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించింది.
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొగోయ్ కూడా ఓటమిపాలు
గువాహటి, మే 4: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. హిమంత బిశ్వశర్మ పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. 126 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 102 సీట్లతో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ 81 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా, దాని మిత్రపక్షాలైన బోడో పీపుల్స్ ఫ్రంట్, అస్సాం గణపరిషత్ చెరో 10 సీట్లను దక్కించుకున్నాయి. అస్సాం సీఎం బిశ్వ శర్మ జలుకబరిలో విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి అధికార పార్టీ జోరుకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేక పోయింది.
కాంగ్రెస్ 21, ఏఐయూడీఎఫ్ 2, ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ కూడా పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అస్సాం పోల్ ఇన్చార్జి భన్వర్ జితేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. అస్సాంలో 16 సీట్లలో తొలిసారిగా పోటీ చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా తన ఖాతాను తెరవడంలో విఫలమైంది. ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ బిన్నకండి నియోజకవర్గంలో విజయం సాధించారు.
ముగ్గురు మాజీ సీఎంల కుమారుల ఓటమి
అస్సాం ఎన్నికల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఓటమిపాలయ్యారు. తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్, హితేశ్వర్ సైకియా కుమారుడు దేవవ్రత సైకియా, భూమిందర్ బర్మన్ కుమారుడు దిగంత బర్మన్ పరాజయం పాలయ్యారు.
అస్సాం మ్యాజిక్ మార్క్ : 64

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- assam election
- BJP
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

