UP Polls : అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఓ కుటుంబ పార్టీ అని బీజేపీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని బస్తీ, లక్నోలో బీజేపీ జన విశ్వాస యాత్రలో పాల్గొన్న జేపీ నడ్డా ఎస్పీపై విమర్శు గుప్పించారు. అఖిలేష్ యాదవ్ 15 మంది ఉగ్రవాదులపై కేసులు ఉపసంహరిస్తే కోర్టు అందుకు అనుమతించలేదని అన్నారు.
వీరిలో నలుగురికి కోర్టు మరణ శిక్ష విధించిందని, మిగిలిన వారికి యావజ్జీవ ఖైదు పడిందని గుర్తుచేశారు. ఇది అఖిలేష్ నిజ స్వరూపం కాగా యోగి ఆదిత్యనాధ్ పాలన సుపరిపాలనని పేర్కొన్నారు. యూపీ భవిష్యత్‌ను యోగి ఆదిత్యానాధ్ ధ్వంసం చేస్తున్నారన్న అఖిలేష్ యాదవ్ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎస్పీ చీఫ్ తన భవిష్యత్ గురించి ప్రస్తావించి ఉంటారని ఎద్దేవా చేశారు.
మరోవైపు మహిళా సాధికారతపై ప్రియాంక గాంధీ చెబుతున్న మాటలను నడ్డా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ హయాంలో నిర్మించిన గృహాల్లో మహిళల కోసం కనీసం మరుగుదొడ్లు కూడా లేవని అన్నారు. మహిళా సాధికారత అప్పుడేమైందని ప్రశ్నించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.