న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌కు నూతన ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్‌ని బీజేపీ ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో సమావేశం తర్వాత మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఖేమ్‌చంద్ సింగ్ ఎన్నికయ్యారు.
ఆ తర్వాత మంగళవారం తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి చెందిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఖేమ్‌చంద్ పేరును ఆమోదించిన తర్వాత అసెంబ్లీలోని కూటమికి చెందిన శాసనసభా పక్ష నాయకుడిగా ఆయనను ఎన్నుకోవలసి ఉంటుంది.