న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో వీగిపోయిన క్రమంలో ప్రతిపక్షాల చర్యను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు నిరసనలు చేపట్టనున్నాయి. మహిళా సాధికారతకు ఉద్దేశించిన బిల్లును ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని ఆరోపిస్తూ ఈ నిరసనలు నిర్వహించనున్నాయి.
మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన తర్వాత ఎన్డీయే కూటమి మంత్రులు, నేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర బీజేపీ నేతలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో సమావేశమయ్యారు.