BJP | ఆగ్రా: 2011లో జరిగిన దాడి కేసులో యూపీలోని ఇటావా సెగ్మెంట్ బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేండ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఆగ్రాలోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ శనివారం తీర్పు వెలువరించారు. 2011లో టోరెంట్ పవర్ కంపెనీ ఆఫీస్ ధ్వంసం, ఉద్యోగులపై దాడి చేసిన కేసులో కతేరియా నిందితుడిగా ఉన్నారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, ఎస్పీ-ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు.
తీర్పు నేపథ్యంలో కతేరియా లోక్సభ సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. అయితే రాహుల్ విషయంలో వేగంగా స్పందించిన కేంద్రం ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాల్సి ఉన్నది.