అహ్మదాబాద్: గుజరాత్ బీజేపీ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీపై, ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ మన్సుఖ్ విమర్శలు ఎక్కుపెట్టారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో దిదియాపాద స్థానంలో ఆప్ అభ్యర్థి చైతార్ వాసవ గెలుపునకు బీజేపీ సీనియర్ నాయకులు సాయం చేశారని ఎంపీ మన్సుఖ్ వాసవ ఆరోపించారు.
‘సీనియర్ బీజేపీ నాయకులు, నర్మదా జిల్లాలో కొంతమంది నాయకులు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థికి అనుకూలంగా పనిచేశారు. బీజేపీ నాయకుల నుంచి ఆప్ ఎమ్మెల్యేకు ఇప్పటికీ మద్దతు అందుతున్నది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను’ అని అన్నారు.