న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: రాహుల్ గాంధీ, ప్రియాంక ఇద్దరూ కేవలం వారి తల్లి సోనియా గాంధీ బలవంతం మీదనే రాజకీయాల్లోకి వచ్చారని ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కామెంట్ చేశారు. ఇటీవల బాగా పాపులరైన త్రీ ఇడియట్స్ సినిమాలో చూపినట్టుగా కుటుంబ సభ్యుల వల్ల పిల్లలు ఇబ్బంది పడినట్టే రాహుల్, ప్రియాంక కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని కంగనా చెప్పారు.
తన ఇష్టాలు వేరే అయినప్పటికీ రాహుల్ రాజకీయాల్లో నటించాల్సి వస్తున్నదని, ఆయన నటనను వృత్తిగా చేసుకుని ఉంటే బాగా రాణించి ఉండేవాడని వ్యంగ్యంగా అన్నారు.