Kangana Ranaut | న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మ గాంధీ, లాల్ బహదుర్ శాస్త్రీల జయంతి సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘దేశానికి జాతిపితలు ఎవరూ లేరు.
కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు. భారతమాతకు ఇలాంటి కుమారులు(లాల్ బహదుర్ శాస్త్రి) ఉండటం అదృష్టం’ అని ఆమె వ్యాఖ్యానించారు. మహాత్మ గాంధీని ఉద్దేశపూర్వకంగా కంగనా రనౌత్ తక్కువ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.